పిల్లల్ని కనడంపై ఉపాసన ట్వీట్.. మెగా ఫ్యామిలీకి వారసుడొస్తున్నాడా?

టాలీవుడ్ హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులకు పెళ్లయి 10 ఏళ్లు అవుతోంది.. అయినా ఈ జంట సంతానం విషయంలో తీపికబురు ఇంకా చెప్పలేదు. దీంతో సోషల్ మీడియాలో దీని గురించి ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంది.. ఈ ప్రశ్న ఎప్పుడు ఎదురైనా ఉపాసన దాటవేస్తూ వస్తోంది.. అయితే ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు జగ్గీవాసుదేవ్ సద్గురు కార్యక్రమంలో ఈ విషయంపై ప్రస్తావించారు.. 

ఎక్కడికెళ్లినా పిల్లల్ని కనడంపై అడుగుతున్నారని, అదేపనిగా రిలేషన్ షిప్, రీప్రొడ్యూస్, రోల్ ఇన్ మై లైఫ్ గురించి ప్రశ్నిస్తున్నారని ఎందుకని సద్గురుని సమాధానం కోరింది. దీనికి సద్గురు ఇచ్చిన సమాధానం షాకింగ్ గా మారింది. ఆరోగ్యంగా ఉండి కూడా పిల్లలు కనకూడదు అని నిర్ణయించుకున్న వారిని నేను అభినందిస్తాను. ఎందుకంటే ఇప్పటికే ప్రపంచ జనాభా 10 కోట్లు సమీపిస్తోంది. సమానం అంతరించిపోతున్న జీవులం కాదు. ఇంకా ఎక్కువవుతున్నాం. పిల్లల్ని కనకూడదు అని నిర్ణయించుకున్న వారికి నేను అవార్డు ఇస్తాను అని సద్గురు అన్నారు. 

తాజాగా ఉపాసన సద్గురుతో ఇంటరాక్షన్ గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. సద్గురుతో మాట్లాడటం, ఎన్నో విషయాల మీద చర్చించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. ఇదే సందర్భంలో పిల్లలను కనకపోతే సద్గురు అవార్డు ఇస్తానన్న దాని గురించి మాట్లాడుతూ.. ‘మా తాత మీరిచ్చే అవార్డును స్వీకరించడానికి ఒప్పుకోవడం లేదు’ అని చెప్పింది. అంటే ఉపాసన పిల్లలను కంటున్నట్లు హింట్ ఇచ్చింది.. అయితే అది ఎప్పుడు అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. 

 

 

Leave a Comment