సైన్యంలోకి శివుడి చేతి త్రిశూలం..ఇక చైన్యా సైన్యం గిలగిల కొట్టుకోవాల్సిందే..!

మీకు గాల్వాన్ ఘటన గుర్తుంది కదూ.. చైనా సైన్యం ఇనుపరాడ్లు, ఇనుపముళ్ల ఆయుధాలతో భారత బలగాలపై దాడి చేశాయి. చైనా బలగాలను మన జవాన్లు సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇప్పుడు చైనా బలగాలకు తగిన బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం సిద్ధమైంది. నూతన ఆయుధాలను సమకూర్చుకుంది.. ఇరుదేశాలు సరిహద్దులో గన్ లు, తుపాకులు వాడకూడదని 1996, 2005లో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అందుకే గాల్వాన్ లో చైనా మూకలు ఇనుపరాడ్లు, ఇనుపముళ్ల ఆయుధాలతో భారత సైన్యంపై దాడి చేశాయి. అయినా చైనా మూకల్ని భారత జవాన్లు ధీటుగా ఎదుర్కొన్నారు. 

చైనా ఆయుధాలను దృష్టిలో ఉంచుకుని భారత్ ఆర్మీ కొత్త ఆయుధాలను తయారు చేస్తుంది. నోయిడాలోని అపాస్టెరాన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఈ ఆయుధాల తయారీ బాధ్యతను అప్పగించారు. ఈ సంస్థ తయారుచేసే ఆయుధాలు చైనా సైనికులకు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వనున్నాయి. శివుడి చేతిలోని త్రిశూలాన్ని తయారు చేస్తున్నాయి. ఈ త్రిశూలం భారత ఆర్మీకి పవర్ ఫుల్ వెపన్ గా మారింది. ఈ త్రిశూలం నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో ప్రత్యర్థి సెకన్ల వ్యవధిలోనే అపస్మారకస్థితికి వెళ్లిపోతాడు. 

మరొకటి వజ్ర అనే మెరుపులతో కూడిన మెటల్ డివైజ్ ను తయారు చేశారు. శుత్రు సైనికులపై దాడి చేసేందుకు వారి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను పంక్చర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఇక సప్పర్ పంచ్ పేరుతో మరో గ్లౌజ్ తయారు చేశారు. ఈ కొత్త టెక్నాలజీతో తయారు చేసిన గ్లౌజ్ తొడుక్కొని ఒక్క పంచ్ ఇస్తే చైనా మూకలు మూర్ఛపోవాల్సిందే.. ఈ లాఠీలు తాకితే చాలు చైనా మూకలు కిందపడి గిలగిల కొట్టుకోవాల్సిందే..ఈ ఆయుధాలు శత్రువుల ప్రాణాలతే తీయవు. కానీ వారికి షాక్ ట్రీట్మెంట్ అయితే ఇస్తాయి. ఇవి ప్రాణహానీ లేనివి. ఎక్కడైనా సులువుగా తీసుకెళ్లొచ్చు. అయితే వీటిని ప్రైవేట్ వ్యక్తులు, సామాన్య ప్రజలకు విక్రయించరు. భద్రతా బలగాలు, లా ఎన్ ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు మాత్రమే విక్రయిస్తారు.  

 

 

 

Leave a Comment