హార్ట్ ఎటాక్ రాకుండా ఉండాలంటే.. ప్రతిరోజూ ఇది తినాల్సిందేనట..!

గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం అధికంగా వస్తున్న జబ్బుల్లో హార్ట్ ఎటాక్ ఒకటి. ఈరోజుల్లో హార్ట్ ఎటాక్ రావడం సర్వసాధారణం అయిపోయింది. దశాద్దం కింద కేవలం వృద్ధులకు, ఉబకాయంతో బాధపడేవారికి గుండెపోటు వచ్చేది. కానీ ఇప్పుడు మారిన జీవనశైలితో యువకులు సైతం గుండెజబ్బులతో ప్రాణాలు కోల్పోతున్నారు. 

కానీ ప్రతిరోజూ ఒక అరటి పండు తినడం వల్ల గుండెపోటు బారి నుంచి తప్పించుకోవచ్చని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు. అరటి పండులో ఇతర పండ్ల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇది శక్తికి మంచి ప్రత్యామ్నాయం కూడా.. రోజూ అరటిపండు లేదా యాపిల్ తింటే గుండెపోటుతో మరణించే ప్రమాదాన్ని మూడో వంతు తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఈ పండు తాజాగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. 

అలబామా యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. అరటిపండ్లు తినడం వల్ల గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. కాబట్టి ధమనులు మూసుకుపోకుండా చేసేందుకు ఉపయోగపడుతుంది. హార్ట్ ఎటాక్ ను నిరోధిస్తుంది. ప్రతిరోజూ ఓ మీడియం సైజ్ అరటి పండు తినడం వల్ల శరీరానికి 9 శాతం పొటాషియం లభిస్తుంది. అరటి పండు తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. హృదయనాళ వ్యవస్థ బాగా పనిచేస్తుంది. ఇది చెబుకొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.   

 

Leave a Comment