పంది కిడ్నీని మనిషికి  అమర్చిన వైద్యులు..!

ప్రపంచంలో ఎంతో మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. బాధితులకు సరైన కిడ్నీ లభించకపోవడంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కిడ్నీ దానం చేసేందుక చాలా మంది ముందుకు వస్తున్నా.. అవయవాల కొరత ఉంది. దీంతో వైద్యులు ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఈక్రమంలో అమెరికాలోని న్యూయార్క్ పరిశోధకులు వినూత్న ప్రయోగం చేశారు. మనిషికి పంది కిడ్నీని అమర్చి విజయవంతం అయ్యారు. న్యూయార్క్ లోని ఎన్ వైయూ లాంగోస్ హెల్త్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా పంది కిడ్నీని మనిషికి అమర్చారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళకు ఈ ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు.. 

ఈ ప్రయోగంలో భాగంగా మనిషి ఇమ్యూనిటీకి సహకరించేలా మొదట పంది జన్యువ్వుల్లో కొంత మార్పులు చేశారు. కిడ్నీలు పనిచేయకపోవడంతో పాటు బ్రెయిన్ డెడ్ అయిన మహిళకు ఆపరేషన్ చేసి పంది కిడ్నీని అమర్చారు. మూడు రోజుల పాటు ఆమెను పరిశీలించారు. మనిషి కిడ్నీ మాదిరిగానే పంది కిడ్నీ కూడా పనిచేసిందని వైద్యులు తెలిపారు. జంతువుల అవయవాలను మనుషులకు అమర్చడంపై శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయోగాలు చేస్తున్నారు. 

 

Leave a Comment