సరిగ్గా ముహూర్తం సమయానికి కరెంట్ పోయింది.. పెళ్లి కూతురు మారిపోయింది..!

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో విచిత్ర ఘటన జరిగింది. సరిగ్గా ముహూర్తం సమయానికి కరెంట్ పోవడంతో పెళ్లి కూతుర్లు మారిపోయారు.. ఇంతకు ఏంజరిగిందంటే.. ఉజ్జయినికి చెందిన రమేష్ లాల్ కి నికిత, కరిష్మా అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీరిద్దరికి ఇటీవల వివాహం కుదిరింది. వేర్వేరు కుటుంబాలకు చెందిన బోలా, గణేష్ లతో పెళ్లి నిశ్చయమైంది. 

ఇద్దరు అక్కాచెల్లెళ్లను ఒకే ముహూర్తానికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఆదివారం ఒకే ముహూర్తానికి పెళ్లి జరుగుతున్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది. సరిగ్గా ముహూర్తం సమయంలో కరెంట్ పోయింది. చీకట్లో పెళ్లి తంతు అయితే పూర్తి చేశారు. తీరా చూస్తే మొత్తం కథ అడ్డం తిరిగింది. 

తెల్లవారిన తర్వాత చూస్తే జంటలు మారిపోయాయి. చెల్లెలికి కాబోయే భర్త ఆమె భర్తను పెళ్లి చేసుకున్నాడు. అక్కకు పెళ్లి చేసుకోవాల్సిన వరుడు ఆమె చెల్లికి తాళి కట్టాడు. పెళ్లి సమయంలో ఈ విషయాన్ని ఎవరూ గుర్తించలేకపోయారు. అప్పగింత సమయంలో అసలు విషయం బయటపడింది. దీంతో పెద్ద వాగ్వాదమే జరిగింది. పెద్దలు కల్పించుకొని మళ్లీ పెళ్లి చేయాలని నిర్ణయించారు.  

 

 

 

Leave a Comment