ప్లాస్టిక్ తో పెట్రోల్.. లీటర్ కి 50 కి.మీ. మైలేజ్..!

ఈ లోకంలో మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదంటరు.. అదే చూపించాడు ఒడిశాకు చెందిన యువకుడు. ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. పర్యావరణానికి పెనుభూతంగా మారిన ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథీన్ తో పెట్రోల్, గ్యాస్ తయారు చేస్తున్నాడు. అయితే ఆ యువకుడు ఏ పెద్ద చదువులు చదవలేదు. చదివింది ఏడో తరగతి మాత్రమే.. అయినప్పటికీ తన ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.. 

ఒడిశాలోని రాధాచరణ్ పూర్ కి చెందిన అజయ్ బెహ్రా ప్లాస్టిక్ తో పెట్రోల్ తయారు చేస్తూ అందరినీ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. వృధాగా పోయే ప్లాస్టిక్ బాటిళ్లు, పాలిథిన్ వస్తువును ఉపయోగించి పెట్రోల్ తయారు చేస్తున్నాడు. రోజుకు 12 నుంచి 13 కిలోల పాలిథీన్ ను సేకరించి.. వాటి నుంచి 7-8 లీటర్ల పెట్రోల్ ను వెలికితీస్తున్నాడు. 

తాను తయారు చేసిన పెట్రోల్ తో బైక్ పై 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని అజయ్ చెబుతున్నాడు. తన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అజయ్ కు ఆర్థిక ఇబ్బందులు సైతం ఎదురయ్యాయి. వాటిని అధికమించేందుకు సొంత బైక్ ని రూ.80 వేలకు అమ్మేశాడు. స్నేహితుల వద్ద కొంత అప్పు చేశాడు. 

ఆ డబ్బులతో పెట్రోల్ తయారు చేసే యంత్రాన్ని కొనుగోలు చేశాడు. పాలిథిన్, వాటర్ బాటిళ్లను నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద మండించి పెట్రోల్ తయారు చేస్తున్నాడు. ఒక కేజీ పాలిథిన్ తో 600 గ్రాముల పెట్రోల్ తయారు అవుతుందని అజయ్ అంటున్నాడు. తన ఆవిష్కరణకు ప్రభుత్వ సాయం తోడైతే అద్భుతాలు చేసి చూపిస్తానని అజయ్ అంటున్నాడు.  

   

 

Leave a Comment