సొంత కోడలిని రూ.80 వేలకు అమ్మేసిన మామ.. కొడుకుకు తెలియడంతో..!

డబ్బలుకు కక్కుర్తి పడి ఓ మామ తన సొంత కోడలును బేరం పెట్టాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. గుజరాత్ కు చెందిన సహిల్ పాంచ అనే వ్యక్తి వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుసుకున్న చంద్రరామ్ తన కోడలిని అమ్మాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రూ.80 వేలకు బేరం కుదుర్చుకున్నాడు..

ఈక్రమంలో రూ.40 వేలు అడ్వాన్స్ గా తీసుకున్నాడు. ఆ అడ్వాన్స్ లో రూ.20 వేలు తన కొడుకు బ్యాంకు ఖాతాకు పంపాడు. ఒక్కసారిగా అంత డబ్బు ఎలా వచ్చిందని ప్రిన్స్ తన తండ్రిని అడిగాడు. చంద్రరామ్ తన కొడుకుకు ఏదోలా నచ్చచెప్పాడు. ఆరోగ్యం బాగాలేదని, తన బాగోగులు చూసుకోవడానికి కోడలిని కొన్ని రోజులు తన వద్దకు పంపమని కోరాడు. 

తండ్రి మాటలను నమ్మిన ప్రిన్స్ తన భార్యను జూన్ 4న ఉత్తరప్రదేశ్ లోని బారబంకిలో ఉంటున్న తండ్రి వద్దకు పంపాడు. జూన్ 5న సాయంత్రం చంద్రరామ్ తనకు ఆరోగ్యం కుదుటపడిందని, ఇంటికి వెళ్లమని కోడలికి చెప్పాడు. తన స్నేహితుడు ఇంటి దగ్గర దింపుతాడని కోడలితో నమ్మబలికాడు. 

దీంతో ఆమె బ్రోకర్ తో వెళ్లింది. తన సమీప బంధువుల ద్వారా విషయాన్ని తెలుసుకున్న ప్రిన్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు బాధితురాలితో సహా రైల్వే స్టేషన్ లో తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉన్న పలువురు నిందితులను అరెస్టు చేశారు. 

Leave a Comment