యూట్యూబ్ లో దుమ్మురేపుతున్న ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్..!

యూట్యూబ్ లో ఓ చిన్న వెబ్ సిరీస్ ‘30 వెడ్స్ 21’ దుమ్మురేపుతోంది. తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటూ ట్రెండింగ్ లో ఉంది. ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ లో చైతన్య, అనన్య హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ వెబ్ సిరీస్ ను పృథ్వీ వనం అనే ఫిలిం మేకర్ రూపొందించాడు. 

కొన్ని నెలల కిందటే ‘30 వెడ్స్ 21’ పేరుతో వెబ్ సరీస్ ని చాయ్ బిస్కెట్ ప్రకటించింది. అయితే రిలీజ్ కు ముందు ఈ సిరీస్ కు అంత ఆదరణ రాలేదు. కానీ వారానికి ఒకటి చొప్పున రెండు ఎపిసోడ్డు బయటికి రాగానే దీనికి అపూర్వమైన ఆదరణ లభించింది. ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్లకు 4 కోట్లకుపైగా వ్యూస్ వచ్చాయి. 

30 ఏళ్ల వయసున్న ఒక సాఫ్ట్ వేర్ ఇంజినీర్, 21 ఏళ్ల వయస్సు ఉన్న చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వారి మధ్య భావోద్వేగాలు, చిలిపి తమాషాలు ఎలా ఉంటాయనే కాన్సెప్ట్ తో  ‘30 వెడ్స్ 21’ వెబ్ సిరీస్ వచ్చింది. వాళ్లిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ వల్ల తలెత్తే సమస్యలు.. చిన్న చిన్న గొడవలు, అలకలు, గిల్లికజ్జాల నేపథ్యంలో చాలా సరదాగా, ఆహ్లాదంగా ఈ సిరీస్ ను తీర్చిదిద్దారు.

ఇక 30 ఏళ్ల బ్యాచిలర్ పృథ్వీ గా చైతన్య అద్భుతంగా నటించాడు. పెళ్లి విషయం బయటపెట్టకుండా ఉండేందుకు భార్య చెప్పే పనులు చేస్తూ నవ్వులు పూయించాడు. ఇక 21 ఏళ్ల అమ్మాయి పాత్రలో అనన్య కూడా పరకాయ ప్రవేశం చేసింది. భర్త వీక్ నెస్ ని అసరాగా చేసుకొని ఆమె చేసిన చిలిపి తమాషాలు ఈ సిరీస్ కి హైలెట్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ సిరీస్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.  

 

Leave a Comment