Viral Video: క్రేజీ అంపైరింగ్.. కాళ్లు పైకెత్తి వైడ్ ఎలా ఇచ్చాడో చూడండి..!

క్రికెట్ లో వినూత్నంగా అంపైరింగ్ చేయడంలో తనదైన ముద్ర వేసుకున్నారు బిల్లి బౌడెన్.. వైడ్, సిక్సర్, ఫోర్ ఇలా ప్రతి దానికి ప్రత్యేక సిగ్నల్ ఇస్తాడు. ఇతర అంపైర్లకు భిన్నంగా బిల్లి బౌడెన్ అంపైరింగ్ ఉంటుంది. అందుకే ఆయన అంపైరింగ్ అభిమానులకు ఎంతగానో ఆకట్టుకునేది.. 

తాజాగా స్థానిక క్రికెట్ లో ఓ అంపైర్ వినూత్నంగా వైడ్ ఇచ్చి అలరించాడు. మహారాష్ట్ర లోకల్ క్రికెట్ టోర్నమెంట్ పురందర్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా జరిగిన మ్యాచ్ లో బౌలర్ వైడ్ వేశాడు. సామాన్యంగా అంపైర్లు రెండు చేతులతో సిగ్నల్ ఇస్తారు.. కానీ ఈ అంపైర్ మాత్రం తలక్రిందులుగా ఉంటూ రెండు కాళ్ల సహాయంతో వైడ్ బాల్ అని సిగ్నల్ ఇచ్చాడు. 

ఈ వీడియోను ఓ ఐఏఎస్ అధికారి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘క్రికెట్, యోగా రెండు కలిస్తే?’ అని క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. రామ్ దేవ్ బాబా ఆ టీమ్ ఓనర్ గా ఉండి ఉంటారని, అతడికి అర్థం కావడానికి ఇలా చేసి ఉంటారని, యోగా టీచర్ పార్ట్ టైమ్ అంపైరింగ్ చేస్తున్నాడని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment