నీళ్ల ట్యాంకులో కుళ్లిన శవం.. నెల రోజులుగా ఆ నీటినే తాగుతున్న జనం..!

హైదరాబాద్ లోని ఓ మంచి నీటి ట్యాంక్ లో కుళ్లిన స్థితిలో శవం ఉండటం కలకలం రేపుతోంది. దాదాపు నెల రోజులుగా ఆ మంచి నీటి ట్యాంక్ లో శవం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఆ నీటినే రోజూ తాగుతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

హైదరబాద్ ముషీరాబాద్ పరిధిలోని జలమండలి నీళ్ల ట్యాంక్ లో శవం బయటపడింది. నీళ్ల ట్యాంక్ ను శుభ్రం చేసేందుకు దిగిన సిబ్బందికి అందులో ఈ శవం కనిపించింది. దీంతో వారు ఈ విషయాన్ని వెంటనే అధికారులు తెలియజేశారు. తక్షణ స్పందించిన అధికారులు, పోలీసుల సాయంతో ట్యాంక్ లో ఉన్న శవాన్ని బయటకి తీయించారు. 

అయితే ఈ ట్యాంక్ లోని నీళ్లను కొన్ని రోజులు ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ముషీరాబాద్ పరిధిలోని శివస్థాన్ పూర్, ఎస్ఆర్కె నగర్, పద్మశాలి సంఘం, హరినగర్ కాలనీలకు ఈ ట్యాంకర్ నుంచి తాగే నీళ్లు సరఫరా అవుతాయి. రిసాలగడ్డ వాటర్ ట్యాంక్ కి కూడా ఇక్కడి నుంచే నీరు సరఫరా అవుతుంది. ఈ ప్రాంతాల్లోని వేల కుటుంబాలు కుళ్లిన శవం పడిన నీటినే తాగుతూ వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఎవరైనా హత్య చేసిన ట్యాంక్ లో శవం పడేశారా.. లేక ప్రమాదవశాత్తు ట్యాంక్ లో పడి మరణించాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

Leave a Comment