బిగ్ బాస్ రెమ్యునరేషన్ తో చిన్నారి ప్రాణాలు కాపాడిన ఉమాదేవి..!

బిగ్ బాస్ రియాలిటీ షో ఐదో సీజన్ రెండో వారం ‘కార్తీకదీపం’ ఫేమ్ ఉమాదేవి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.. హౌస్ లో ప్రతి కంటెస్టెంట్ తో కోపానికి దిగుతూ నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడుతూ ప్రేక్షకుల ఆగ్రహానికి గురైంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఉమాదేవి దూరమైంది. అంతేకాదు నిబంధనలను పట్టించుకోకుండా హౌస్ లో రచ్చ చేసింది. కంటెస్టెంట్స్ అందరితో గొడవపడుతూ బిగ్ బాస్ షోలో గయ్యాళిగంపగా పేరు తెచ్చుకుంది. 

అయితే బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాగా ఉమాదేవి గొప్ప నిర్ణయం తీసుకుంది. బిగ్ బాస్ నుంచి వచ్చే రెమ్యునరేషన్ ను మంచి పని కోసం ఉపయోగించింది. బాగ్ బాస్ ద్వారా తనకు వచ్చిన రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు వినియోగించింది. దీంతో ఉమాదేవి చేసిన మంచి పనికి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆమె గొంతే కాదు.. మనసు కూడా పెద్దదే అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

Leave a Comment