వరుడికి షాకిచ్చిన వధువు.. తాళి కడుతుండగా నాకు పెళ్లొద్దు అంటూ.. వీడియో వైరల్..!

పెళ్లంటేనే ఫన్, నవ్వులు, ఫ్రెండ్స్ టీజింగ్ అన్ని కామన్. పెళ్లిలో ఆ మాత్రం సరదా, హంగామా ఉంటేనే పది కాలాల పాటు గుర్తుంటుంది. గతంలో పెళ్లిళ్లో పెళ్లి కూతురు సిగ్గు పడుతూ ఉండేవారు. కానీ ఈ కాలంలో వారు చాలా ఫ్రీగానే ఉంటున్నారు. ఎంత ఫ్రీగా ఉన్నా పద్ధతిగానే ఉంటారు..కానీ ఇక్కడ ఓ పెళ్లి కూతురు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. ఇక వరుడు మాత్రం ఏంజరిగిందంటూ చూస్తూ ఉండిపోయాడు. ఇంతకు ఆ పెళ్లి కూతురు ఏం చేసిందంటే..

పెళ్లి మండపంలో పెళ్లి తంతు అంతా జరుగుతోంది. వేద పండితుడు మాత్రాలు చదువుతున్నాడు. వధువు మెడలో తాళి కట్టాలని వరుడికి చెప్పాడు. మండపంలో అందరూ చూస్తుండగా వరుడు వధువు మెడలో తాళి కట్టబోయాడు. అంతలో పెళ్లి కూతురు పీటలపై నుంచి లేచింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటూ మండపం నుంచి బయలుదేరింది. దీంతో వరుడితో పాటు అందరూ షాకయ్యారు. అసలు ఏంజరింది, ఎందుకు వెళ్లిపోతుందనేది ఎవరికీ అర్థం కాలేదు. కానీ అంతలోనే పెళ్లి కూతురు నవ్వుతూ తిరిగి వెనక్కి వచ్చేసింది. దీంతో ఆమె సరదాగా ఆటపట్టించిందని అంతా అనుకున్నారు. కాని వరుడు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు.     

 

Leave a Comment