మోడీజీ అండగా ఉండండి.. భారత్ సాయం కోరిన ఉక్రెయిన్..!

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం స్టార్ చేసింది.. ఉక్రెయిన్ పై రష్యా బలగాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. ఈనెపథ్యంలో భారత సాయాన్ని కోరింది ఉక్రెయిన్.. భారత్ లోని ఉక్రెయిన్ రాయబారి డా.ఇగోర్ పొలిఖా మాట్లాడుతూ ఇలాంటి క్లిష్ట పరిస్థితులను పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని, తమకు భారత్ అండగా ఉండాలని కోరారు. 

రష్యా చేస్తున్నది సైనిక చర్య కాదని, ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి యుద్ధానికి దిగిందని ఇగోర్ తెలిపారు. రష్యా బలగాలు సరిహద్దులు దాటి తమ భూభాగంలోకి వచ్చాయన్నారు. రష్యా దాడుల్లో తమ సైనికులతో పాటు సామాన్య పౌరులు కూడా చనిపోయినట్లు సమాచారం వచ్చిందన్నారు. ఈ సంక్షోభ సమయంలో భారత్ జోక్యం చేసుకోవాలని, ఉక్రెయిన్ అండగా ఉండాలని కోరారు. 

భారత్ ప్రపంచంలో కీలక పాత్ర పోషిస్తోందని, భారత ప్రధాని మోడీ ప్రపంచంలోని శక్తివంతమైన గొప్ప నాయకుల్లో ఒకరని చెప్పారు. రష్యాతో భారత్ కు ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. అందువల్ల ఉద్రిక్తలను తగ్గించడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రధాని మోడీ వెంటనే రష్యా అధ్యక్షుడు పుతిన్, తమ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఫోన్ చేసి మాట్లాడాలని కోరారు. ప్రపంచంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎవరి మాట వింటారో? లేదో? తెలియదుకానీ, ప్రధాని మోడీ మాటలను ఆలోచిస్తారని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 

Leave a Comment