టీనేజర్లకు కరోనా టీకా వద్దు.. యూకే సైంటిస్టుల సంచన ప్రకటన..!

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు. త్వరలో చిన్ని పిల్లలకు, టీనేజ్ పిల్లలకు కూడా వ్యాక్సిన్ వేసేందుకు ఇప్పటికే వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ ట్రయల్స్ పూర్తయితే త్వరలోనే పిల్లలకు, టీనేజర్స్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది.

ఈనేపథ్యంలో యునైటెడ్ కింగ్ డమ్ సైంటిస్టులు సంచలన ప్రకటన చేశారు. పిల్లలకు వ్యాక్సినేషన్ విషయలో తొందరపాటు వద్దని సూచించారు. యూకేలో 12-17 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ వేయడం లేదని, ప్రపంచ దేశాలు కూడా ఆచితూచి స్పందంచాలని సూచిస్తోంది. ఆ వయస్సు పిల్లల్లో ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటే అలాంటి వారికి వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపారు. క్యాన్సర్, డయాబెటీస్ వంటి రోగాలతో బాధపడుతున్న టీనేజర్లకు మాత్రమే టీకా ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యవంతులైన వారికి ఈ టీకా అవసరం లేదని స్పష్టం చేశారు.

కాగా కొన్ని దేశాలు చిన్న పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇస్తున్నాయి. వారి ఆరోగ్య పరిస్థితి సంబంధం లేకుండా వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఈ అంశంలో పునరాలోచించుకోవాలని యూకే నిపుణులు సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి ఉండి కరోనాను ఎదుర్కోగల శక్తి ఉన్న వారికి వ్యాక్సిన్ అవసరం లేదని చెబుతున్నారు. అలాగే ఒకసారి కోవిడ్ వచ్చి రికవరీ అయిన వారికి కూడా వ్యాక్సిన్ అవసరం లేదని పేర్కొంటున్నారు. 

Leave a Comment