ఆ ఉత్సవానికి బట్టతల ఉంటేనే రావాలట..!

బాల్డ్ హెడ్.. అదే బట్టతల.. బట్టతల ఉన్న వాళ్లు చాలా ఇబ్బందులు పడుతుంటారు. బయటికి రావాలంటేనే దడుసుకుంటారు. ఇక పెళ్లి కాని వారు అయితే ఇక చెప్పాల్సిన పనిలేదు. బట్ట తల ఉన్న అబ్బాయిలను ఎవ్వరూ పెళ్లి చేసుకోరు కదా. వాళ్లు పడే బాధలు వర్ణణాతీతం.. ఇలాంటి వారి కోసం ఓ ఉత్సవమే నిర్వహిస్తున్నారు. బట్ట తల శాపం కాదని, అది అదృష్టం అని చాటి చెప్పేలా అమెరికాలోని న్యూయార్క్ లో అతిపెద్ద ఉత్సవం జరుగుతోంది. అయితే ఈ ఉత్సవానికి వచ్చే వారికి ఒక షరతు విధించారు. కేవలం బట్ట తల ఉన్న వారు మాత్రమే రావాలి..

అమెరికాలో 5 కోట్ల మంది పురుషులు, 3 కోట్ల మంది మహిళలు బట్టతలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారి కోసం అమెరికా రాపర్ రమి ఈవెన్ ఎష్ న్యూయార్క్ లో ‘బాల్డ్ ఫెస్టివల్’ జరపడం స్టార్ట్ చేశాడు.. ఈ ఉత్సవానికి బట్ట తల ఉన్నవారు అర్హులు. బ్రూక్లిన్ లోని రుబులాడ్ క్లబ్ లో ఈ ఉత్సవానికి 18 డాలర్లు చెల్లించి వెళ్లాల్సి ఉంటుంది. బట్ట తల లేకుంటే ఉత్సవానికి అనుమతించరు. ఫ్యాషన్ వీక్ ఫెస్ట్ కు పోటీగా బట్టతల ఫెస్ట్ ను నిర్వహించడం మొదలుపెట్టారు. ఇక ఈ ఫెస్టివల్ లో బట్ట తల ఉన్న వారు బాధపడొద్దని, బాల్డ్ గా ఉన్న దర్జాగా బతకొచ్చని అవకహన కల్పిస్తారు. బట్టతలను ఎంత అందంగా తయారు చేసుకోవచ్చో వివరిస్తారు. తర్వాత అందరూ ఫ్యాషన్ షో చేస్తారు.  

Leave a Comment