ఉదయ్ పూర్ హంతుకుడికి బీజేపీతో సంబంధాలు?

  • ఫొటో ఆధారాలతో కాంగ్రెస్ ఆరోపణ

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన టైలర్‌ కన్హయ్య లాల్‌ హత్య కేసుపై కాంగ్రెస్ కీలక ఆరోపణలు చేసింది. హంతకులు రియాజ్ అఖ్తరీ, గౌస్ మొహమ్మద్‌లకు బీజేపీతో సంబంధాలున్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. నిందితులు బీజేపీ నేతలతో కలిసి దిగిన ఫొటోల ఆధారాలతో కాంగ్రెస్‌ నేతలు సోషల్‌ మీడియాలో మండిపడ్డారు. 

హంతుకులలో ఒకరైన రియాజ్‌ అఖ్తరీ రాజస్థాన్‌ బీజేపీ మైనారిటీ సెల్‌లో కీలక సభ్యుడని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పవన్ ఖేడా ఆరోపించారు. బీజేపీ మైనార్టీ సెల్‌ నేతలైన ఇర్షాద్ చైన్‌వాలా, మహ్మద్ తాహిర్‌తో ప్రధాన నిందితుడు దిగిన ఫొటోలను మీడియా ఎదుట ఆయన బయటపెట్టారు. అంతేగాక రాజస్థాన్‌ బీజేపీ నేత, మాజీ మంత్రి గులాబ్‌చంద్ కటారియా కార్యక్రమాల్లో కూడా రియాజ్‌ పాల్గొన్నాడని తెలిపారు.

 హంతకులు బీజేపీకి చెందిన వారు కాబట్టే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కేసును తొక్కిపెట్టేందుకు ఎన్‌ఐఏ దర్యాప్తునకు అప్పగించిందని విమర్శించారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతల ఆరోపణలను బీజేపీ ఖండించింది.  కన్హయ్య లాల్‌ను చంపిన నిందితులు బీజేపీ సభ్యులు కాదని ఆ పార్టీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్ మాల్వియా తెలిపారు. 

Leave a Comment