కుమార్తె ఎదుగుదలను చూసి గర్వపడుతూ.. సీఎం జగన్ ట్వీట్..!

సీఎం జగన్ పెద్ద కూతురు హర్ష ప్యారిస్ లోని ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆమె కాన్వొకేషన్ కార్యక్రమానికి సీఎం జగన్, భారతీ దంపతులు ప్యారిస్ వెళ్లిన సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ ద్వారా ఎమోషన్ పోస్ట్ చేశారు. గ్రాడ్యుయేషన్ పట్టాతో ఉన్న హర్షతో ఉన్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశారు.. 

‘డియర్ హర్ష.. నీ ఎదుగుదలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది. నీకు ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఇన్సీడ్ బిజినెస్ స్కూల్ నుంచి డిస్టింక్షన్ లో పాస్ కావడమే కాకుండా డీన్స్ లిస్ట్ లో నీ పేరు చూసి గర్వపడుతున్నాను. భవిష్యత్తులో భగవంతుడు నీకు అన్ని విధాలుగా తోడుగా నిలవాలని కోరుకుంటున్నా’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.   

Leave a Comment