ఈనెలలో మరో రెండు తుపానులు..!

బంగాళాఖాతంలో మరో రెండు తుపాన్లు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 14 లేదా 15న ఒక తుఫాన్, 21 తర్వాత మరో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. సముద్ర వాతావరణ పరిస్థితులతో పాటు హిందూ మహాసముద్రం డైపోల్(ద్విధ్రువ) వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ తుఫాన్ లు ఏర్పతాయని పేర్కొన్నారు. 

ఈ తుపాన్ల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణం కంటే అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ప్రస్తుతం దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తరాంధ్ర మీదుగా వాయువ్య గాలువు వీస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. 

 

Leave a Comment