పాముతో కరిపించి భార్యను చంపించిన భర్తకు రెండు జీవితఖైదులు..!

యూట్యూబ్ లో చూసి భార్యను పాముతో కరిపించి చంపించిన కేసులో కేరళ జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషిగా తేలిన భర్తకు రెండు జీవిత ఖైదులు విధించింది. శిక్షతో పాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. అక్టోబర్ 11న విచారణ ముగించిన కోర్టు తాజాగా శిక్షను ఖరారు చేసింది.

ఉత్తర, సూరజ్ భార్యాభర్తలు.. కాగా 2020లో లాక్ డౌన్ సమయంలో సూరజ్ భార్యపైకి పామును ఉసిగొల్పి నెల రోజుల్లో రెండు సార్లు ఆమెను చంపేందుకు ప్రయత్నించాడు. మొదటి సారి విఫలమైంది. ఇక రెండో సారి భార్యను పాము కాటువేయడంతో ఆమె చనిపోయింది. అయితే భార్య చనిపోయిన కొన్నిరోజులకు సూరజ్ ఆమె ఆస్తి కోసం ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చి ఉత్తర తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూతురి మరణంపై తమకు అనుమానముందని ఫిర్యాదు చేశారు. 

ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్ని రకాల ఆధారాలను సేకరించారు. నాగ్ పూర్, ఇండోర్ లలో వెలుగచూసిన ఈ తరహా కేసులను అధ్యయనం చేశారు. పోలీసులు విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. దీంతో కోర్టు నిందితుడికి 2 సార్లు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు ఇచ్చింది. నిందితుడు వయస్సు 28 సంవత్సరాలు కనుక అతనికి మరణశిక్ష బదులు జీవిత ఖైదు విధించాలని కోర్టు భావించింది. అతనిపై నమోదైన కేసుల్లో.. ఒక కేసులో పదేళ్లు, మరో కేసులో ఏడేళ్ల శిక్ష పడింది.  

 

Leave a Comment