కోవిడ్ తర్వాత కొత్త రోగాలతో అల్లాడిపోతున్న ప్రజలు..!

కోవిడ్ నుంచి కోలుకున్నాక చాలా మందిలో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కోవిడ్ తర్వాత 3 నుంచి 6 నెలల వరకు పోస్ట్ కోవిడ్ సమస్యలు వేధిస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యలతో ఆస్పత్రిలో చేరిన ప్రతి 100 మందిలో 80 మందికి కండరాల బలహీనతతో అలసత్వం, నీరసం వంటి సమస్యలు, 20 మందిలో జ్ఞాపకశక్తి నశించడం, డయేరియా, ఒళ్లు నొప్పులు వంటి సమస్యలు వేధిస్తున్నట్లు గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల పరిశీనలతో తేలింది. ప్రతి రోజూ ఇలాంటి సమస్యలతో గాంధీ ఆస్పత్రికి సుమారు 100 నుంచి 120 మంది బాధితులు వస్తుండగా.. ఉస్మానియాకు సుమారు 150 మంది పోస్ట్ కోవిడ్ సమస్యలతో వస్తున్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. 

ఇటీవల కాలంలో పోస్ట్ కోవిడ్ అనంతరం జుట్టు ఊడిపోతున్న సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు కూడా వేధిస్తున్నాయి. దగ్గు, జ్వరం, జలువు వంటి లక్షణాలతో చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఇలాంటి వారు కరోనా టెస్టులకు వెళ్లడం లేదు. దీంతో వైరస్ లంగ్స్ పై దాడి చేసే ప్రమాదం ఉందని ఆరోగ్య శాఖ అధికారులు  సూచిస్తున్నారు. అంతే కాక కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పైన పేర్కొన్న ఏ ఒక్క లక్షణం ఉన్నా వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. 

Leave a Comment