రెండు తలలు, మూడు కళ్లతో లేగదూడ.. దుర్గామాత అవతారంగా కొలుస్తున్న జనం..!

ఒడిశాలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. నబ్రంగ్ పూర్ జిల్లా బిజాపుర గ్రామంలో రెండు, తలలు, మూడు కళ్లతో ఓ ఆవు లేగదూడకు జన్మనిచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ గా మారింది. దీంతో ఈ వింత లేగదూడను చూసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. 

అంతేకాదు ఈ విశేషం నవరాత్రి ఉత్సవాల సమయంలో జరగడంతో దుర్గామాత అవతారంగా భావిస్తున్నా అక్కడి ప్రజలు.. ఈ లేగదూడకు పూజలు చేస్తున్నారు. ఈ విషయం తెలిసి సమీప గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా అక్కడికి చేరుకుంటున్నారు.

అయితే రెండు తలలు కలిగి ఉండటంతో ఆ లేగదూడ తల్లి ఆవు నుంచి పాలు తాగలేకపోతుంది. ఆ లేగదూడకు డబ్బాతో పాలు పడుతున్నట్లు వాటి యజమాని చెప్పారు. ప్రస్తుతం ఈ లేగదూడకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Leave a Comment