వామ్మో.. బాయ్ ఫ్రెండ్ కోసం నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు యువతులు.. వీడియో వైరల్..!

ఒక అమ్మాయి కోసం ఇద్దరు అబ్బాయిలు కొట్టుకోవడం చూసే ఉంటారు.. కానీ ఇక్కడ ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకున్నారు. ఏ రేంజ్ లో అంటే.. నడిరోడ్డుపై అందరరూ చూస్తుండగానే జట్టు పట్టుకుని మరీ గొడవకు దిగారు. ఈ ఘటన జార్ఖండ్ లో చోటుచేసుకుంది. 

జార్ఖండ్ జరాయ్కేలాకి చెందిన ఓ యువకుడు, ఓ యువతి ప్రేమించుకున్నారు. అయితే ఆ యువకుడు మరో యువతితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండడ చూసి మొదటి గర్ల్ ఫ్రెండ్ ఆవేశంతో ఊగిపోయింది. 

నా బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతావా అంటూ ఆమె చెంపలు వాయించింది. అక్కడితో ఆగలేదు. జుట్టు పట్టుకుని రోడ్డుపైనే కొట్టేసుకున్నారు. వారిద్దరినీ వారించేందుకు ప్రియుడు ఎంత ప్రయత్నించినా ఇద్దరు పట్టించుకోలేదు. తర్వాత పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో మొదటి గర్ల్ ఫ్రెండ్ ఆమె స్నేహితురాలు పరారయ్యారు. ప్రస్తుతం ఈ ఫైట్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Leave a Comment