ట్రూ కాలర్ డేటా లీక్..

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ ట్రూ కాలర్ యాప్ ను వినియోగిస్తుంటారు. తమకు తెలియని నెంబర్ నుంచి ఫోన్ వస్తే ఈ యాప్ ద్వారా ఎవరు కాల్ చేసింది తెలుస్తుంది. అయితే ఈ యాప్ పై గతంలో ఎన్నో ఆరపణలు వచ్చాయి. ఆటోమెటిగ్ గా వినియోగదారుడి ఎస్ఎంఎస్ రీడింగ్ అవుతుండటంతో..దీనిపై గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. బ్యాంకింగ్ కి సంబంధించి ఓటీపీలు వచ్చే సమయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పుకార్లు ఉన్నాయి. దీంతో చాలా మంది ఈ యాప్ ను తమ మొబైల్ నుంచి డిలీట్ చేసేశారు. తాజాగా ట్రూ కాలర్ యాప్ పై మరో ఆరోపణలు వచ్చాయి. 

ఈ యాప్ ను ఎక్కువగా భారత దేశంలో వినియోగిస్తుంటారు. అయితే దాదాపు 4.75 కోట్ల మంది ఇండియన్స్ సంబంధించి ట్రూ కాలర్ డేటా వివరాలను ఓ సైబర్ నేరగాడు రూ.75 వేలకు ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టినట్లు ఓ సంస్థ గుర్తించింది. ట్రూ కాలర్ డేటాకు సంబంధించిన వివరాల్లో..వినియోగదారుడి మొబైల్ నెంబర్ తో పాటుగా, స్త్రీ, పురుషుడు, నివసించే అడ్రస్, కస్టమర్ వినియోగించే మొబైల్ నెట్ వర్క్ సోషల్ మీడియా ఐడీలు కూడా ఉన్నట్లు సమాచారం. 

ఈ విషయాన్ని సైబిల్ అనే ఆన్ లైన్ ఇంటెలిజెన్స్ సంస్థ ప్రకటించింది. అయితే ట్రూ కాలర్ కు సంబంధించిన అధికారులు మాత్రం తమ అధికారిక డేటా అది కాదని, తమ డేటాబేస్ చాలా సేఫ్ గా ఉందని తెలిపారు. ఇప్పటికే ట్రూ కాలర్ డేటా చాలా సార్లు లీక్ అయినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే..

Leave a Comment