ఈనెల 31 తర్వాత పూర్తి లాక్ డౌన్..!

ప్రస్తుతం లాక్ డౌన్ 4 కొనసాగుతోంది. ఈనెల 31తో ఈ లాక్ డౌన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనల్లో సడలింపులు ఇచ్చాయి. అయితే ఈ సడలింపులతో భవిష్యత్తులో తీవ్ర ముప్పు వాటిల్లబోతుందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నారు నిపుణులు..

కరోనా వైరస్ తో ప్రపంచంలోని దేశాలు అల్లాడుతున్నాయి. ఈ వైరస్ పై పోరాడేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ విధించాయి. మన భారతదేశంలో కూడా గత  60 రోజుల నుంచి లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ సమయంలో ప్రజల ఇబ్బందులను ద్రుష్టిలో ఉంచుకుని అత్యవసర సేవలను మినహాయించారు. 

అయితే ఆర్థిక పరిస్థితుల ద్రుష్ట్యా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులను ఇచ్చింది. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు దాదాపు అన్ని దుకాణాలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుమతులు ఇచ్చాయి. భౌతిక దూరం నిబంధనలు, మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది. అయితే ప్రజలు ఈ నిబంధనలను ఎవరూ కూడా  సరిగ్గా పాటించడం లేదు. యథేచ్ఛగా రోడ్లపైకి వస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలు కూడా పాటించడం లేదు. 

 

అంతే కాదు.. మద్యం అమ్మకాలకు కూడా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో మద్యం ప్రియులు దుకాణాల ముందు కిలో మీటర్ల మేర క్యూ కడుతున్నారు. దీని వల్ల కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 

ప్రస్తుతం దేశంలో కూడా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరణాల రేటు కూడా పెరుగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈనెల 31 నుంచి మరోసారి లాక్ డౌన్ విధించనున్నట్లు సోషల్ మీడియా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ సారి పూర్తిగా షట్ డౌన్ చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు  మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.  

ఇక ఇదే గనుక జరిగితే ప్రజలు మళ్లీ తమ నివాసాలకు పరిమితం కాకా తప్పదు. దీనికి తోడు వలస కూలీలు కూడా రాష్ట్రాల నుంచి వస్తున్నారు. విదేశాల నుంచి కూడా సొంత ప్రాంతాలకు ప్రజలు చేరుకుంటున్నారు. ప్రజలు కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వాలు పెట్టిన నిబంధనలను తప్పకుండా పాటించాలి. అందరూ ఒకే చోట గుమిగూడ కుండా భౌతిక దూరం, మాస్కులు ధరించడం చేయాలి. 

Leave a Comment