గర్భిణిని 5 కి.మీ. మోసుకెళ్లిన జవాన్లు..!

దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే జవాన్లు సామాన్య ప్రజలకు సాయం అందించేందు వెనుకాడరు. జమ్మూకశ్మీర్, ఇతర ప్రాంతాల్లో ఎవరికి ఏం అవసరం వచ్చినా సైనికులు ముందుంటారు. తాజాగా జమ్ముూకశ్మీర్ కుప్వారాలోని ఓ గర్భిణీకి సాయం చేసేందుకు భారత జవాన్లు ముందుకొచ్చారు. 

లోలబ్ రోడ్డు మంచుతో నిండిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ తొలగించే పరిస్థితులు లేకపోవడంతో గర్భిణీని మంచంపై 5 కిలోమీటర్ల దూరం వరకు జవాన్లు మోసుకెళ్లారు. ఆమెను ఓ కారు వద్దకు చేర్చి, అక్కడి నుంచి ఆస్ప్రతికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Leave a Comment