అవార్డు వేడుకలో పూర్తి నగ్నంగా నటి..!

‘ఫ్రెంచ్ సీజర్’ అవార్డుల వేడుకలో ఓ నటి వినూత్నంగా నిరసన తెలియజేసింది. కరోనా వైరస్ సమయంలో సంస్కృతికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం మరింత కృషి చేయాలని నటి కోరిన్ మాసిరో(57) డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా తన దుస్తులను తొలగించి పూర్తి నగ్నంగా మారిపోయింది. 

ఉత్తమ దుస్తులకు అవార్డు ఇచ్చేందుకు నటి మాసిరోను ఆహ్వానించారు. ఆ సమయంలో ఆమె రక్తంతో తడిసిని గాడిదను పోలిన దుస్తులతో వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ పూర్తి నగ్నంగా మారి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. పారిస్ ఒలింపియా కచేరీ హాల్ లో ‘నో కల్చర్.. నో ఫ్యూచర్’ అనే నినాదంతో ఆమె దర్శనమిచ్చారు. ఇంత కంటే కోల్పోయేది ఏమీలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.   

 

Leave a Comment