12 నుంచి పట్టాలెక్కనున్న రైళ్లు..

సుదీర్ఘ లాక్ డౌన్ తరువాత దేశంలో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 12 నుంచి ఢిల్లీ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లు నడపనున్నార. 

ఇక సోమవారం సాయంత్రం నుంచి టికెట్ల బుకింగ్ తెరవబడుతుంది. ఐఆర్సీటీసీ ద్వారా రేపు సాయంత్రం నుంచి టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. 

దేశంలో మొత్తం 15 రూట్లలో 30 రైళ్లు అందుబాటులోకి తెచ్చారు. ఢిల్లీ నుంచి ఆయా రాష్ట్ర రాజధానులకు రైళ్లు కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రతి ప్రయాణికుడికి స్క్రీనింగ్ టెస్టు తప్పనిసరి చేసింది. 

ఈ రైళ్లు ఢిల్లీ స్టేషన్ నుంచి దిబ్రుఘర్, అగర్తాలా, హౌరా, పాట్నా, బిలాస్ పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మాడ్గావ్, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్మూతావి లను కలిపే ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. 

Leave a Comment