నిమిషాలు, గంటలు కాదు.. ఏడాది ఆలస్యంగా వచ్చిన రైలు..!

దేశంలో రైలు సర్వీసుల్లో జాప్యం సర్వసాధారణం. నిర్దేశిత సమయం కంటే కొన్ని నిమిషాలు లేదా గంటల తర్వాత గమ్యస్థానానికి చేరుకుంటాయి. ఇదేమీ పెద్ద ఆశ్చర్యం కాదు. కానీ, ప్యాసింజర్ రైలు మాత్రం గంటల తరబడి కాదు ఏకంగా ఏడాది ఆలస్యంగా వచ్చింది. డిపార్చర్ స్టేషన్ నుంచి 762 కి.మీల దూరంలో ఉన్న ఓ గమ్యస్థానానికి ఏడాది తర్వాత చేరుకుంది.

 మే 2021లో గమ్యస్థానానికి చేరుకోవాల్సిన ఈ రైలు ఈ నెల 17న చేరుకుంది. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు బోగీలోకి వెయ్యి బస్తాల బియ్యాన్ని ఎక్కించారు. అక్కడి నుండి జార్ఖండ్‌లోని న్యూ గిరిడి స్టేషన్‌కు చేరుకోవడానికి రైలు 762 కి.మీ. ఇంజన్‌లోని సాంకేతిక కారణాల వల్ల సమయానికి స్టార్ట్ కాలేదు. 

తర్వాత అధికారులెవరూ పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఏడాది ఆలస్యంగా మే 17న బోగీతో గూడ్స్ రైలు న్యూ గిరిడి స్టేషన్‌కు చేరుకోవడంతో రైల్వే సిబ్బంది షాక్‌కు గురయ్యారు. పేదలకు అందాల్సిన ఆహార ధాన్యాలు ఏడాది ఆలస్యమైందని.. 200-300 బస్తాల బియ్యం దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. దీనిపై విచారణకు ఆదేశించారు. 

 

Leave a Comment