నోరు అపరిశుభ్రంగా ఉంటే.. ఎన్ని వ్యాధులు కలుగుతాయో తెలుసా..?

నోరు మంచిదైతే.. ఊరు మంచిది అవుతుంది అనే ఓ సామెత ఉంది.. అలానే నోరు శుభ్రంగా ఉంటే సగం వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు.. ఎందుకంటే అనేక రోగాలకు మన నోరే రహదారి.. నోరు శుభ్రంగా ఉంచుకుని నోటి ఆరోగ్యం బాగుంటే.. గుండె జబ్బులూ, ఛాతీ ఇన్ఫెక్షన్ల వంటి అనేక జబ్బులను నివారించుకోవచ్చు..

దంతాల ఇన్ఫెక్షన్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని దాదాపు మూడు రెట్లు పెంచుతాయి. దంతాల ఇన్ఫెక్షన్లకు చికిత్స తీసుకున్న వారి కంటే.. చికిత్స తీసుకోని వారిలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం 2.7 రెట్లు అధికంగా ఉన్నట్లు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 30 శాతం మరణాలు కేవలం గుండె సంబంధిత వ్యాధుల నుంచి సంభవించినవే అని ఓ పరిశోధనలో తేలింది. 

అపరిభుశ్రమైన నోరు లేదా అక్కడ చేరే సూక్ష్మక్రిములే ప్రత్యక్షంగా గుండె జబ్బులతో పాటు పరోక్షంగా డయాబెటీస్, ఆస్టియోపోరోసిస్, అనేక శ్వాసకోశ వ్యాధులతో పాటు అరుదుగా కొన్ని క్యాన్సర్లకు కారణమవుతాయి. ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అక్కడ వచ్చే కొద్ది పాటి సమస్యలైన పళ్లలో రంధ్రాలు, చిగుర్ల సమస్యలు వంటి వాటికి తేలికపాటి చికిత్సలు తీసుకుంటూ ఉంటే.. అనేక వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.     

 

Leave a Comment