6 ఏళ్ల బాలికపై టీఆర్ఎస్ నేత అత్యాచారం.. బండి సంజయ్ పరామర్శ..!

అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై టీఆర్ఎస్ పార్టీ నేత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన గిరిజన దంపతులు ఉపాధి కోసం అల్మాన్ పూర్ కు వచ్చి రాధారపు శంకర్(48) ఇంట్లో కొంతకాలంగా అద్దెకు ఉంటున్నారు. ఈ దంపతులకు ఆరేళ్ల చిన్నారి ఉంది. శంకర్ భార్య అల్మాన్ పూర్ గామానికి సర్పంచ్.. కాగా శంకర్ రైతు బంధు మండల అధ్యక్షుడిగా ఉన్నారు. 

కాగా ఈ గిరిజన దంపతులు ఉద్యోగరీత్యా బయటకు వెళ్లారు. స్కూల్ నుంచి ఇంటికొచ్చిన ఆరేళ్ల బాలిక శంకర్ ఇంట్లో టీవీ చూసేందుకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న బాలికకు చెక్లెట్లు ఇస్తానంటూ గదిలోకి తీసుకెళ్లి శంకర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండు రోజుల అనంతరం కడుపు నొప్పి వస్తుందంటూ బాలి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

దీంతో సదరు నాయకుడిపై టీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంది. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన రైతు బంధు సమితి మండల కన్వీనర్ శంకర్ ను పదవి నుంచి తొలగించడంతో పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే నిందితుడు శంకర్ ను ఉరితీయాలని ప్రతిపక్షాలతో పాటు ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

బాలికకు బండి పరామర్శ..

రెడ్ హిల్స్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. అభం శుభం తెలియని చిన్నారి బంగారు భవిష్యత్తును నాశనం చేసిన మూర్ఖులు టీఆర్ఎస్ పార్టీ నాయకులని మండిపడ్డారు. సిరిసిల్లలో సీఎంఓ ఒత్తిడి, మంత్రి ఒత్తిడితో నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశారని విమర్శించారు. సిరిసిల్ల ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. వెంటనే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

Leave a Comment