కేరళలో చిన్నారులకు టమోటా ఫీవర్..!

కేరళలో టమాటా ఫీవర్ వణికిస్తోంది.. ఇప్పటికీ దాదాపు 100 మంది చిన్నారులకు ఈ జ్వరం సోకింది. కేరళ రాష్ట్రంలో చిన్నారులను, తల్లిదండ్రులను టమోటా జ్వరం భయాందోళనలు రేపుతోంది.. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఈ వ్యాధి బారిన పడ్డారు. తమిళనాడులోనూ ఈ జ్వరం వ్యాప్తిపై ఆందోళన నెలకొంది.. దీంతో సరిహద్దు జిల్లాల్లో పరీక్షలు చేస్తున్నారు. 

ఈ టమోటా జ్వరం ముఖ్యంగా చిన్నపిల్లల్లో కనిపిస్తోంది.. ఇది వైరల్ ఫీవరా లేక చికెన్ గున్యానా, డెంగ్యూ ఫీవరా అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. ఈ ఫీవర్ వచ్చిన చిన్నారులకు చర్మంపై టమోటా సైజులో ఎర్రటి దద్దులు, దురద, డీహైడ్రేషన్, 102 డిగ్రీలకు పైబడి జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ జ్వరం సోకేందుకు గల కారణాన్ని వైద్యులు ఇప్పటి వరకు నిర్ధారించలేదు.

టమోటా జ్వరం సోకితే జ్వరంతో పాటు చర్మ సంబంధిత వ్యాధులు, వాంతులు, విరోచనాలు, కడుపు కింద భాగంలో దద్దర్లు, ముక్కు కారడం, దగ్గు, అలసట, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.  

 

Leave a Comment