మద్యం బాటిళ్లు తరలిస్తున్న వాహనం బోల్తా.. పండుగ చేసుకున్న మందుబాబులు..!

మద్యం ఫ్రీగా దొరికితే మందుబాబులు ఊరుకుంటారా.. ఎగబడతారు కదూ.. అదే మద్యం రోడ్డుపై దొరికితే.. ఇంకేముంది..దొరికినన్ని బాటిళ్లు ఎత్తుకెళ్తారు.. తమళనాడులోని మధురై హైవేపై అదే జరిగింది. రూ.10 లక్షల విలువైన మద్యం లోడ్ తో వెళ్తున్న వాహనం బోల్తా పడటంతో మద్యం బాటిళ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. 

ఇది గమనించిన స్థానికులు ఈ అవకాశం మళ్లీ రాదన్నట్లు రోడ్డుపై బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దొరికినంత దోచుకొని వెళ్లారు. దీంతో ఆ రహదారిపై ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. తర్వాత పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు. డ్రైవర్ వాహనాన్ని కంట్రోల్ చేయకపోవడంతో అదుపుతప్పి బోల్తాపడిందని పోలీసులు తెలిపారు. రోడ్డుపై మద్యం సీసాలు, పెట్టెలను స్థానికులు పట్టుకెళ్తున్న ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.     

Leave a Comment