ఇంత కంటే గొప్ప త్యాగం ఉంటుందా?.. అమ్మా నీకు వందనం..!

అమ్మ ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఎక్కడా లేదు. తన బిడ్డ కోసం ఎన్నో త్యాగులు చేస్తుంది. దేశ రక్షణ కోసం తన బిడ్డను సరిహద్దుకు పంపడం కూడా.. ఆ కన్న తల్లి చేసే త్యాగమే.. దినదిన ప్రాణగండం ఉందని తెలిసి కూడా ఎంతో సంతోషంగా తన కొడుకును సరిహద్దుకు పంపుతుంది.. ఆ బిడ్డ వెళ్తుంటే.. తల్లి బాధ వర్ణనాతీతం.. 

తాజాగా ఓ తల్లి తన కొడుకును దేశం కోసం సరిహద్దుకు పంపుతున్నట్లు కనిపించే ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. తిరిగి వస్తాడో లేదో తెలియని సందేహంతోనే నవ్వుతూ వీడ్కోలు పలికి.. మూసిన గేటు వెనక తల్లి కన్నీళ్లు తుడుచుకోవడం ఆ ఫొటోలో కనిపిస్తుంది. ఈ ఫొటోను లెఫ్టినెంట్ జనరల్ సతీశ్ దువా షేర్ చేశారు. 

‘దాదాపు 30 ఏళ్ల క్రితం నేను నా తల్లిని కోల్పోయాను. ప్రతి సైనికుడి తల్లిలో తనను చూసుకుంటున్నాను. ప్రతి తల్లిలో భారత మాతను చూస్తున్నాను. అమ్మా నీకు వందనం’ అని రాసుకొచ్చారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది నిజంగా గొప్ప త్యాగం.. హృదయాలను కలిచివేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.    

Leave a Comment