Tokyo Olympics: పురుషుల హాకీలో భారత్ కు కాంస్యం..!

టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్ విజయం సాధించింది. 5-4 తేడాతో జర్మనీని ఓడించింది. దాదాపు 41 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో పతకాన్ని అందుకుంది. 

టోక్యోలోని ఒయి హాకీ స్టేడియం నార్త్ పిచ్ లో కాంస్య పతకం కోసం భారత్ – జర్మనీ మధ్య పోరు జరిగింది. మ్యాచ్ మొదటి క్వార్టర్స్ లో 0-1 గోల్స్ తో భారత్ జట్టు వెనుకపడింది. రెండో క్వార్టర్స్ లో సిమ్రన్ జీత్ ఒక గోల్ సాధించి స్కోరును 1-1 సమం చేశాడు. తర్వాత జర్మనీ ఆటగాళ్లు రెండో గోల్స్ సాధించి 3-1 ఆధిక్యం పెంచుకున్నారు. హర్ధిక్ సింగ్, హర్మన్ ప్రీత్ చెరో గోల్ సాధించి 3-3 తో సమం చేశారు. మూడో క్వార్టర్స్ లో జర్మనీపై భారత్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఇందులో భారత్ రెండు గోల్స్ సాధించింది. రూపిందర్ పాల్, సిమ్రన్ జిత్ చెరో గోల్స్ చేయడంతో స్కోర్ 5-3కు చేరింది. ఇక నాలుగో క్వర్టర్స్ లో జర్మనీ గోల్ సాధించి ఆధిక్యాన్ని 5-4కు తగ్గించింది. స్కోర్ ను సమం చేసేందుకు జర్మనీ ఎంత ప్రయత్నించినా భారత ఆటగాళ్లు అవకాశం ఇవ్వలేదు.  

దీంతో 1980 తర్వాత ఒలింపిక్స్ లో పతకాన్ని సాధించింది భారత్.. ఆ సంవత్సరంలో స్వర్ణ పతకం గెలువగా, ఆ తర్వాత పతకం గెలువలేదు. ఇప్పుడు జర్మనీతో జరిగిన మ్యాచ్ లో గెలిచి కాంస్య పతకం సాధించింది. ఇప్పటి వరకు ఒలింపిక్స్ లో భారత్ కు 8 స్వర్ణాలు, ఒక రజత పతకం, మూడు కాంస్య పతకాలు వచ్చాయి. 

Leave a Comment