వ్యాక్సిన్ మిక్సింగ్ తో మంచి ఫలితాలు..!

కోవిడ్ ని అరికట్టేందుకు టీకా ఒక్కటే ఆయుధం.. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా వేగవంతంగా అమలు చేస్తున్నారు. అయితే టీకా విషయంలో ఇప్పటికీ కూడా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈక్రమంలో రెండు డోసుల వ్యాక్సిన్లను కలిపి తీసుకోవడంపై అధ్యయనం చేస్తున్నారు. ఒకే రకమైన టీకాను రెండు డోసుల్లో తీసుకోవడం కంటే.. మిక్స్డ్ విధానంలో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోగలమని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని స్వీడన్ లో చేపట్టారు. దీని నివేదికను ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ది లాన్సెట్ యూరప్ విభాగం ప్రచురించింది. అంతకుముందు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలోనూ ఇవే పలితాలు వచ్చాయి. 

ఆస్ట్రాజెనికా, ఫైజర్ టీకాలు..

స్వీడన్ లో దాదాపు 7 లక్షల మంది పౌరుల సమాచారాన్ని పరిణగణలోకి తీసుకుని సమాచారాన్ని విశ్లేషించారు. రెండో డోస్ తీసుకున్న తర్వాత 2.5 నెలల వరకు వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించారు. అందులో భాగంగా ఆస్ట్రాజెనికా, ఫైజర్ టీకాలను కలిపి తీసుకుంటే 67 శాతం ముప్పు తగ్గినట్లు గుర్తించారు. ఆస్ట్రాజెనికా, మోడెర్నా వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల 79 శాతం ముప్పు తగ్గింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవడం వల్ల 50 శాతం మాత్రమే ముప్పు తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. 

అయితే ఈ మిక్సింగ్ పద్ధతిలో అవి సురక్షితం, సమర్థతపై భారీస్థాయిలో అధ్యయనాలు జరపాలని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. తాజా అధ్యయనంలో మిక్సింగ్ పద్ధతిలో వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చనట్లు ఉమేయా యూనివర్సిటీ ప్రొఫెసర్ మార్కెల్ బాలిన్ వెల్లడించారు. అయితే ఈ పద్ధతి వల్ల ఎంతకాలం రక్షణ కలిగిస్తాయనే విషయాన్ని అధ్యయనంలో వెల్లడించలేదు. ఇండియాలోనూ మిక్సిన్ పద్ధతిపై అధ్యయనాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ విధానంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.   

Leave a Comment