‘అయ్యగారు ఫ్యాన్’ని కలిసిన అఖిల్..!

హీరోలందరికీ చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. కానీ ఫ్యాన్స్ అందరినీ హీరోలు గుర్తుపెట్టుకోరు కదా.. అయితే హీరోల దృష్టిలో చాలా తక్కువ మంది ఫ్యాన్స్ పడుతుంటారు. అలా సోషల్ మీడియాలో అఖిల్ పేరు కంటే ఎక్కవగా ఆయన వీరాభిమాని ‘అయ్యగారి ఫ్యాన్’ పేరు బాగా వినిపించింది. గతంలోనూ ‘అయ్యగారే నంబర్ వన్.. అయ్యగారే తోపు’ అంటూ ఈ ఫ్యాన్స్ రచ్చ చేశాడు. ఒకసారి గూగుల్ లో అయ్యగారు అని సెర్చ్ చేసి చూస్తే థియేటర్ బయట ‘హలో’ సినిమా రివ్యూ ఇస్తున్న అఖిల్ వీరాభిమాని కనిపిస్తాడు. అతని పేరు నాగరాజు.. ఆ వీడియోతో పాటు అతను కూడా చాలా పాపులర్ అయ్యాడు.

కాగా తన కొత్త సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ కు మంచి హిట్ టాక్ రావడంతో అఖిల్ ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ లోకి వచ్చాడు. అందులో ఓ అభిమాని అయ్యగారి అభిమాని గురించి అడిగాడు. దీనిపై స్పందించి అఖిల్.. ‘నా ఫ్యాన్ ఇంత పాపులర్ కావడం సంతోషంగా ఉంది. ‘అయ్యగారే నంబర్ వన్’ అనే పదం నా జీవితాన్ని మార్చేసింది. ఆ పదాన్ని నా సినిమాలో కూడా ఉపయోగించాము. తప్పకుండా త్వరలోనే ఆ అభిమానిని కలుస్తాను.’ అంటూ అఖిల్ వీడియోలో చెప్పారు.

ఈనేపథ్యంలో అఖిల్ ఆ అభిమానిని నిజంగా కలుస్తాడా? లేదా? అన్న చర్చ సోషల్ మీడియాలో బాగా జరిగింది. అయితే అఖిల్ అందర్నీ షాక్ ఇస్తూ తన అయ్యగారు ఫ్యాన్ ని కలిశాడట.. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖిల్ పిలుపుతో హైదరాబాద్ వచ్చిన అయ్యగారు ఫ్యాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అయితే అఖిల్ తన అభిమానితో కలిసి దిగిన ఫొటో మాత్రం బయటకు రాలేదు. కేవలం అభిమాని ట్రెండీ లుక్ మాత్రమే బయటకు రావడంతో సోషల్ మీడియాలో అఖిల్ తన అభిమానిని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.  

 

Leave a Comment