2020 ఏడాదిని కొట్టేసిన టైమ్ మ్యాగజైన్.. ఎందుకో తెలుసా?

2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరూ అవస్థలు పడ్డారు. ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి. ఎంతో మంది జీవోనోపాధి కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ఈఏడాది ప్రతి ఒక్కరికీ చేదు అనుభవాలను మిగిల్చింది. కరోనా ఎప్పుడు అంతమవుతుందో తెలీదు. కరోనా ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతే కాదు ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడి ప్రజల జీవనం ఛిన్నాభిన్నం అయింది.  

ఈక్రమంలో ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ తన లేటెస్ట్ మ్యాగజైన్ కవర్ పేజీపై 2020 సంవత్సరాన్ని కొట్టివేసింది. కవర్ పేజీపై 2020 అంకెను ప్రచురించి దానిని రెడ్ క్రాస్ మార్క్ తో కొట్టేసింది. ఈ సంవత్సరం ప్రపంచానికి మిగిల్చిన చేదు అనుభవానికి గుర్తుగా ఈ విధంగా చేసినట్లు టైమ్ మ్యాగజైన్ ప్రకటించింది. 2020 ఎప్పటికీ ఒక చెత్త సంవత్సరంగా పేర్కొంది. 

కాగా టైమ్ మ్యాగజైన్ క్రాస్ గుర్తును ప్రచురించడం ఇది మొదటి సారి కాదు. గతంలో నాలుగు సార్లు క్రాస్ గుర్తును ప్రచురించింది. 1945లో రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అడాల్ఫ్ హిట్లర్ మృతి చెందినప్పుడు నియంత అంతానికి చిహ్నంగా క్రాస్ గుర్తును ప్రచురించింది. అదే ఏడాది జపాన్ ఫసిఫిక్ యుద్ధాన్ని ఆపడానికి కవర్ పేజీపై క్రాస్ మార్క్ చేసింది.

ఆ తర్వాత 2003లో సద్దాం హుస్సేన్ చనిపోయినప్పుడు అలానే చేసింది. 2006లో మౌసబ్ ఆల్ జర్ క్వానీని అమెరికా దళాలు మట్టుబెట్టినప్పుడు, 2011లో ఒసామా బిన్ లాడెన్ హతమైనప్పుడు టైమ్ మ్యాగజైన్ క్రాస్ గుర్తును వేసింది. మళ్లీ ఇప్పుడు 2020 సంవత్సరానికి సంఘీభావంగా తన కవర్ పేజీపై క్రాస్ గుర్తును ప్రచురించింది.     

Leave a Comment