‘కౌన్ బనేగా కరోడ్ పతి’లో రూ.25 లక్షలు గెలుచుకున్న బుడతడు..!

కౌన్ బనేగా కరోడ్ పతి షో ఎన్నో సంవత్సరాల నుంచి అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ షో 12వ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో కేబీసీ యాజమాన్యం స్టూడెంట్స్ కోసం ప్రత్యేక ఎపిసోడ్ ను షూట్ చేసింది. ఈ ఎపిసోడ్ లో గుజరాత్ భారుచ్ కు చెందిన 14 ఏళ్ల అన్మోల్ శాస్ట్రీ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. అన్మోల్ ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. 

ఇక అమితాబ్ బచ్చన్ చిన్నారికి హాట్ సీట్లో కూర్చొబెట్టారు. ఆ తర్వాత అతడిని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇందులో భాగంగా అన్మోల్ తనకు మూడు కోరికలు ఉన్నాయని చెబుతాడు. నోబెల్ ప్రైజ్ గెలవడం, ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా నిలవడం, ఖగోళ భౌతిక శాస్త్రవేత్త కావాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఏపీజే అబ్దుల్ కలాం, స్టీఫెన్ హాకింగ్ తనకు ఇష్టమైన శాస్త్రవేత్తలను చెప్పాడు. ఈ షోలో గెలిచే డబ్బులతో ఓ టెలిస్కోప్ కొంటానని అన్మోల్ తెలిపాడు. 

ఈ షోలో అన్మోల్ రూ.25 లక్షలు గెలుచుకున్నాడు. అన్మోల్ మాటలకు ఫిదా అయిన అమితాబ్ అతనికి ‘జిగ్యసు’ అని ముద్దు పేరు పెట్టారు. ఈ షోలో రూ.20 వేల ప్రశ్నకు అన్మోల్ తడబాటు లేకుండా వెంటనే సమాధానం చెబుతాడు. దీంతో బిగ్ బీ ఆశ్చర్యపోయాడు. కామిక్ బుక్స్ ప్రకారం ఓ టీనేజర్ కు  రేడియో యాక్టివ్ సాలీడు కడుతుంది. దాంతో అతడికి మానవాతీత శక్తులు వచ్చిన గోడలను సైతం అలవోకగా ఎక్కుతుంటాడు. అతడు ఎవరని ప్రశ్నించాడు. అన్మోల్ పీటర్ పార్కర్ అని వెంటనే సమాధానం చెబుతాడు. 

ఆ తర్వాత బిగ్ బి అడిగిన వరుస ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో బాలుడి టాలెంట్ కు ముగ్ధుడయ్యాడు. టెలిస్కోప్ సాయంతో గుర్తించిన మొదటి గ్రహం ఏది అని రూ.25 లక్షల ప్రశ్నను వేస్తాడు బిగ్ బీ.. ఆన్మోల్ తన చివరి లైఫ్ లైన్ వాడుకుని యూరెనస్ అని సరైన సమాధానం చెప్తాడు. ఆ తర్వాత టెస్ట్, వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరని రూ.50 లక్షల ప్రశ్న అడుగుతాడు. ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో క్విట్ అయిన అన్మోల్ రూ.25 లక్షలను ఇంటికి తీసుకెళ్లాడు.   

 

Leave a Comment