అందుకే నిహారిక పెళ్లికి రాలేదు : రేణు దేశాయ్

మెగాడాటర్ నిహారిక పెళ్లి డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ లో జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీలో అందరూ సందడి చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా పెళ్లికి ఒకరోజు ముందు అక్కడికి వెళ్లి రెండు రోజులు అక్కడే ఉన్నారు. ఈ పెళ్లిలో పవన్ కళ్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్యలు కూడా కనిపించారు. 

నిహారిక పెళ్లికి మెగా ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ తమ షూటింగ్ డేట్స్ అడ్జస్ట్ చేసుకొని హాజరయ్యారు. కానీ ఈ పెళ్లిలో రేణు దేశాయ్ మాత్రం మిస్సయ్యారు. నిహారిక వివాహానికి ఆమె ఎందుకు హాజరు కాలేదని ప్రశ్న అందరిలోనూ కలిగింది. కొందరైతే ఆమెను వేడుకకు ఆహ్వానించలేదని ప్రచారం చేశారు. 

ఈ నేపథ్యంలో నిహారిక వివాహానికి తాను ఎందుకు హాజరుకాలేదనే విషయంపై రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. తనకు ముందుగా ప్లాన్ చేసుకున్న షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొనాల్సి రావడంతో పెళ్లికి రాలేకపోయానని చెప్పారు. అయితే తన ఇద్దరు పిల్లలు అకిరా నందన్, ఆధ్యలు తండ్రి పవన్ కళ్యాణ్ తో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొని సరదాగా గడిపారని పేర్కొన్నారు.     

Leave a Comment