కిలాడి లేడీ : బ్లాక్ మెయిల్ చేస్తూ ముచ్చటగా మూడు పెళ్లిళ్లు..

జీవితంలో స్థిరపడ్డ అబ్బాయిలను ఎరవేయడం, పెళ్లి చేసుకుని కొంత కాలం కాపురం చేయడం, ఆ తర్వాత బెదిరించి సెటిల్ మెంట్ చేసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. కాదని ఎవరైనా ఎదురు తిరిగితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ఆమె స్టైల్. ఇలా ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది.  చివరి ఆమె లీలలు వెలుగు చూశాయి. ప్రకాశం జిల్లా దొనకొండలో నాలుగో పెళ్లి చేసుకున్నాక ఈమె వ్యవహారం బట్టబయలైంది.

ఈ యువతి తిరుపతికి చెందిన పతంగి స్వప్న. అలియాస్ పతంగి హరిణి, అలియాస్ నందమురారి స్వప్న. ఒకరికి ఇన్ని పేర్లు ఎందుకని వినేవారికి అనుమానం రావచ్చు. అదే ట్విస్ట్ ఇక్కడ. మూడు పేర్లు పెట్టుకుని ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మ్యాట్రి మోని వెబ్ సైట్ లలో తాను ఐపీఎస్ అధికారిగా బయోడేటా ఇచ్చి అమాయకంగా ఉండే వాళ్లును పెళ్లి చేసుకుంటుంది. కొంత కాలం కాపురం చేసుకున్నాక..తర్వాత సెటిల్ మెంట్ చేసుకుంటుంది. 

పతంగి స్వప్న తిరుపతిలో ఓ హాస్టల్ లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసింది. తొలుత ఆమెకు తన మేనమామతో వివాహం జరిగింది. కొద్ది రోజులకు మేనమామను వదిలేసింది. ఆ తర్వాత తిరుపతికే చెందిన పృథ్విరాజ్ ను పెళ్లి చేసుకుంది. ఇక కొద్ది రోజుల తర్వాత అతడిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి రూ.25 లక్షలు డిమాండ్ చేసింది. 

ఆ తర్వాత జర్మానీలో పని చేసే ఆత్మకూరుకు చెందిన సుధాకర్ ను మ్యాట్రిమోనీ ద్వారా పరిచయం చేసుకుంది. అతడితో పెళ్లికి సిద్ధమైంది. ఆ లోగా అతని వద్ద నుంచి రూ.5 లక్షలు దబ్బు లాగింది. నెక్ట్స్ డెన్మార్క్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన విప్పర్ల రామాంజనేయులును తాను ఐపీఎస్ అధికారి అని పరిచయం చేసుకుంది. 2019 డిసెంబర్ 12న వివాహం జరిగింది. ఆమెపై అనుమానంతో రామాంజనేయులు 2020 మార్చిలో డెన్మార్క్ చెక్కేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. విచారణలో ఆమె వ్యవహరాలు బట్టబయలయ్యాయి. 

 

Leave a Comment