మాస్క్ పెట్టుకోలేదని మేక అరెస్టు..!

ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ బెకన్ గంజ్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. యజమాని మాస్కు పెట్టుకోలేదని పోలీసులు మేకను అరెస్టు చేశారు. ఓ వ్యక్తి మాస్క్ లేకుండా రోడ్డుపై తిరుగుతున్నాడు. దీంతో పోలీసులు మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ప్రశ్నించారు. పోలీసులు అడగడంతో మేక యజమాని అక్కడి నుంచి పారిపోయాడు. మేకను అక్కడే వదిలిపెట్టాడు. దీంతో పోలీసులు మేకను పోలీస్ స్టేషన్ కు తరలించారు. 

కొద్ది సేపటి తర్వాత ఆ యజమాని వచ్చి చూస్తే మేక కనిపించలేదు. మేక వివరాలను అక్కడున్న వారిని అడిగాడు. పోలీసులు మేకను అరెస్టు చేసి తీసుకెళ్లారని స్థానికులు చెప్పడంతో ఆ యజమాన్ షాక్ కు గురయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎప్పుడు మాస్క్ లేకుండా తిరగనని చెప్పడంతో పోలీసులు మేకను విడిచిపెట్టారు. ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. 

Leave a Comment