ఆ ఇంట్లో అందరూ కలెక్టర్లే..!

సాధారణంగా ఇంట్లో ఒకరు కలెక్టర్ గా ఉంటేనే ఎంతో గర్వంగా ఉంటుంది. అలాంటిది ఇంట్లో మొత్తం కలెక్టర్లు అయితే అది ఎంతో గొప్ప విషయం.. 2018లో నిర్వహించిన రాజస్తాన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ పరీక్ష ఫలితాల్లో రాజస్తాన్ లోని హనుమాఘర్ కు చెందిన అన్షు, రీతు, సుమన్ అనే ముగ్గురు అక్కాచెల్లెళ్లు రాజస్తాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కు ఎంపికయ్యారు.

ఇప్పటికే ఆ ఇంట్లో నుంచి రోమా, మంజులు కలెక్టర్లుగా పనిచేస్తున్నారు. తాజాగా ఈ ముగ్గురు కూడా ఆర్ఏఎస్ కు ఎంపిక కావడంతో ఆ ఇంట్లో ఇప్పుడు అందరూ కలెక్టర్లుగా ఉండటం విశేషం..

హనుమాఘర్ లోని  శ్రీ సహదేవ్ సహరన్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రైతు. ఆయనుకు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకులు లేకపోయినా కూతుళ్లను కష్టపడి చదివించాడు.

 ఇప్పుటికే ఇద్దరు కూతుళ్లు కలెక్టర్లు కాగా, తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో మరో ముగ్గురు కూతుళ్లు కూడా ఆర్ఏఎస్ కు ఎంపికయ్యారు. ఈ విజయంతో వారి తండ్రికి, కుటుంబానికి అరుదైన గౌరవం లభించింది. ఒకే కుటుంబం నుంచి ఐదుగరు అక్కాచెల్లెళ్లు కలెక్టర్లుగా ఎంపికై యువతు ఆదర్శంగా నిలిచారు. 

ఈ విషయాన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ ట్విట్టర్ లో తెలిపారు. ఆ అక్కాచెల్లెళ్ల ఫొటో షేర్ చేసిన ఆయన వారికి కంగ్రాట్స్ చెప్పారు. కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కాచెల్లెళ్లే ఒకే సర్వీస్ ఎగ్జామ్ ను క్లియర్ చేయడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతంది. 

 

Leave a Comment