కరెంట్ దొంగ పాక్కుంటూ వెళ్లి.. భలే చిక్కాడు..!

విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ అధికారుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఘజియాబాద్ కు చెందిన ఓ వ్యక్తి కరెంట్ మెయిన్ లైన్ నుంచి దొంగతనంగా ఇంటికి వైర్ లాక్కున్నాడు.  

రోజంతా అక్రమంగా విద్యుత్ వినియోగించుకుంటూ బిల్లు లేకుండా, ఏసీలు, ఫ్రిజ్, ఇంట్లో లైట్లు.. ఇలా దొంగతనంగానే రాజభోగం అనుభవించేవాడు. విద్యుత్ అధికారులు పర్యవేక్షణకు వచ్చినప్పుడు కరెంట్ వైర్లను కట్ చేసేవాడు.

విద్యుత్ దొంగతనం జరుగుతందని ఫిర్యాదు అందడంతో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు విచారించడానికి అక్కడికి వెళ్లాడు. దీంతో అప్రమత్తమైన ఆ దొంగ ఇంటికి లోపల గడియపెట్టేసి బాల్కనీపైకి మెల్లగా పాకుతూ వెళ్లి అక్కడున్న లింక్ వైర్ ను కట్ చేయబోయాడు.

అయితే అప్పటికే ఓ అధికారి టెర్రస్ మీదకు వెళ్లి వీడియో తీసున్నాడు. టెర్రస్ మీద ఉన్న మెట్లపై ఇటుక రాళ్లతో కప్పి ఉన్న జాయింట్ వైర్లు కట్ చేస్తున్న క్రమంలో అధికారికి చిక్కాడు. ‘తమ్ముడు నేనిక్కడే ఉన్నా’ అని ఆ అధికారి మాట విన్న ఆ కరెంట్ దొంగ ఎక్స్ చూడాల్సిందే.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.    

 

Leave a Comment