ఉదయాన్నే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాకింగ్ చేసే వారికి షాకింగ్ న్యూస్!!

ప్రతి ఒక్క మనిషికి మొబైల్ ఫోన్ ఎప్పుడు గుండెకాయ లాగా ఏమైంది. మొబైల్ ఫోన్ లేనిదే ఒక్క నిమిషం కూడా ఉండలేని పరిస్థితి దాపురించింది. చిన్నపిల్లలు మొదలుకొని 70 ఏళ్ల వృద్ధులు కూడా అ మొబైల్ లేనిది ఉండలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఆరోగ్యం కోసం ఉదయాన్నే చేసే వాకింగ్ జాగింగ్ ఈ సమయంలో కూడా మొబైల్ ఫోన్ అధికంగా వాడుతున్నారు. ఇది సరైనది కాదు అని అని వైద్యులు సూచిస్తున్నారు.

వాకింగ్ చేసే సమయంలో ఇయర్ ఫోన్స్ వాడితే?

  1.   కండరాల నొప్పి: ఉదయం పూట వ్యాయామం చేయడం వల్ల మానవుని శరీరం ఎంతో ఆరోగ్యంగా ఉల్లాసంగా ఫిట్గా ఉంటుంది.ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని కొంతమంది తరచుగా వ్యాయామం చేస్తూ ఉంటారు. దీనివల్ల కండరాలలో అసమతుల్యత అవుతుంది. దీనికి కారణంగా కండరాల నొప్పి ప్రారంభమవుతుంది.

 

  1. వెన్నెముకపై ప్రభావం: సాధారణంగా వాకింగ్ చేసే సమయంలో వెన్నెముక నిటారుగా ఉండాలి అని నిపుణులు సూచిస్తున్నారు గారు. అయితే ఆ సమయంలో మీరు మొబైల్ ఫోన్ వాడితే వెన్నెముక నిటారుగా ఉంచడానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా మాటిమాటికి మొబైల్ స్క్రీన్ చూడాలి అందులో ఏవైనా మెసేజ్, పాటలు మార్చడానికి ఇలా తాపత్రయంతో ఇష్టం వచ్చిన విధంగా వాకింగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల దీర్ఘకాలికంగా వెన్నెముకపై ప్రభావం పడుతుంది.

 

  1. ఏకాగ్రత లోపిస్తుంది: నిజానికి వాకింగ్ చేయడం మొదలుపెట్టగా చాలా ఏకాగ్రతతో చేయవలసి ఉంటుంది. ఇలా చేయడం వలనే శరీరానికి మంచి ఫలితం వస్తుంది. కానీ మొబైల్ ఫోను చూసుకుంటూ నడవడం వల్ల మన దృష్టి మరలు తుంది. వాకింగ్ చేసే విధానం మీద అ పట్టు ఏకాగ్రత కోల్పోతాం. దీనివల్ల వాకింగ్ ప్రయోజనమే ఉండదు. ఏకాగ్రత లోపించటం జరుగుతుంది. అందువల్ల నడుస్తున్నప్పుడు ఫోన్ మన దగ్గర లేకపోవడమే చాలా మంచిది ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.

 

  1. వెన్ను నొప్పి వచ్చే అవకాశం: వైద్యులు చేసిన కొన్ని పరిశోధనల్లో వెల్లడయింది ఏమిటంటే వాకింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ చూడటం వల్ల, మెడ,వెన్ను భాగంలో  లో నొప్పి మొదలవడం జరుగుతుంది. ఎందుకంటే వాకింగ్ చేసేటప్పుడు సరైన దిశలో వాకింగ్ ప్రక్రియ జరగదు మొబైల్ చూడడం వల్ల. దీనివల్ల మెడ వెన్నపూస లో నొప్పి మొదలవుతుంది.

Leave a Comment