ఇంజనీర్ల బిర్యానీ.. నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?

ఇంజనీర్ల బిర్యానీ అంటే.. అది ఏదో ఉద్యోగాలు లేక బిర్యానీ పాయింట్ పెట్టుకున్నారని కాదండో.. వారు నిజంగా ఇంజనీర్లే.. ఉద్యోగాలు చేస్తూ బిర్యానీ పాయింట్ ఏర్పాటు చేసి భారీగా సంపాదిస్తున్నారు.. 2021 మార్చి నుంచి ఒడిశాలోని మల్కన్ గిరిలోని పట్టణ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని వీధిలో ఈ ఫుట్ కార్ట్ నిలుస్తుంది. ఈ ఫుట్ కార్టులో రుచిరకమైన బిర్యానీ, చికెన్ టిక్కా ప్రత్యేకం..సుమిత్, సమల్, ప్రియం బెబర్తా అనే ఇద్దరు స్నేహితులు ప్రొఫెషనల్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తూ.. ఇంజనీర్ థేలా అనే ఫుడ్ కార్ట్ నిర్వహిస్తున్నారు. ప్రతి నెలా లక్షల్లో సంపాదిస్తున్నారు.

సుమిత్, ప్రియం చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.. ఇద్దరూ ప్రొఫెషనల్ ఇంజనీర్లే.. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాల్సి వచ్చింది. వీరికి బిర్యానీ అంటే చాలా ఇష్టం.. రోజు సాయంత్రం బిర్యానీ తినడానికి వెళ్లేవారు. అయితే అక్కడ స్టాల్స్ లలో పరిశుభ్రత లోపం ఉండేది. అంతేకాదు నాణ్యమైన ఆహారం కూడా లభించేది కాదు. దీంతో వీరిద్దరికీ ఓ ఐడియా వచ్చింది. తామే నాణమైన ఆహారం తయారు చేసి విక్రయించాలని అనుకున్నారు. 

వీరి ఆలోచనను ఆచరణలో పెట్టారు. ఇద్దరు స్నేహితులు కలిసి రూ.50 వేల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇద్దరు వంటవాళ్లను కూడా పెట్టుకున్నారు. ఒక గదిని అద్దెకు తీసుకుని బిర్యానీ వండేవారు. ఇంట్లో వండిన ఆహారంలా నాణ్యతలా ఉండేలా చూసుకున్నారు. ప్రతి సాయంత్రం తమ పని అయిపోయిన తర్వాత హ్యాండ్ కార్ట్ లో బిర్యానీ విక్రయించేవారు. చికెన్ బిర్యానీ ఒక ప్లేట్ ధర రూ.120, సగం ప్టేల్ ధర రూ.70 అమ్మేవారు. అలా రోజుకు 100 ప్లేట్ల వరకు వీరు అమ్మకాలు చేస్తున్నారు.  ఈ విధంగా వారు రోజుకు రూ.8 వేలు సంపాదిస్తున్నారు. అంటే నెలకు దాదాపు 2.5 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఖర్చులన్నీ తీసేసి నెలకు రూ.45 వేలు మిగిలుతున్నాయి. ఉద్యోగాలు చేస్తూనే సొంతంగా వ్యాపారం చేసుకుంటూ రెండు చేతుల సంపాదిస్తున్నారు ఈ ఇద్దరు ఇంజనీర్ స్నేహితులు.. 

Leave a Comment