కరోనా తర్వాత కుళ్లిపోతున్న పేగులు.. నిమ్స్ లో చేరిన ఆరుగురు..!

కరోనా తగ్గిన తర్వాత బాధితుల్లో కొత్త సమస్యలు ఆందోళనకు గరిచేస్తుననాయి. మానవ శరీరంలో అన్ని అవయవాలపై కూడా కొవిడ్ ప్రభావం చూపుతోంది. తాజాగా చిన్నపేగులపై కరోనా ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఇటీవల రోజుల వ్యవధిలో కడుపు నొప్పితో ఆరుగురు నిమ్స్ లో చేరారు. వీరిని పరీక్షించిన వైద్యులు వారి చిన్న పేగుల్లో రక్తం గడ్డకట్టి కుళ్లిన స్థితికి మారినట్లు గుర్తించారు. 

ఆస్పత్రిలో చేరిన ఇద్దరిలో సమస్య తీవ్రంగా ఉండటంతో పేగులను తొలగించారు. వీరి కిడ్నీలు కూడా విఫలమయ్యాయని, డయాలసిస్ చేస్తూ చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. మరో నలుగురికి కూడా ఆపరేషన్ చేసి కొంత మేర పేగు తొలగించామని పేర్కొన్నారు. అయితే ఈ ఆరుగురికి కరోనా సోకినట్లు వారితే తెలీదు. వీరి శరీరంలో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కొవిడ్ సోకడంతోనే ఈ ఆరుగురిలో చిన్నపేగుల్లో రక్తం గడ్డకట్టిందని నిమ్స్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ఎన్.బీరప్ప తెలిపారు. పేగులకు రక్తప్రసరణ అందకపోవడంతో అక్కడ శరీర కణజాలం చనిపోయి గ్యాంగ్రేన్(కుళ్లిన స్థితికి)గా మారిందని చెప్పారు. కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు, నల్లరంగులో విరేచనాలు వంటి లక్షనాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు. చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ ఇబ్బంది ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆస్పత్రికి వచ్చిన ఈ ఆరుగురిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇద్దరు మాత్రమే ఇప్పటి వరకు టీకా తొలి డోసు తీసుకున్నారు.  

Leave a Comment