ఈ సారి ఏకంగా గాంధీపైనే వివాదాస్ప వ్యాఖ్యలు చేసిన కంగనా..!

వివాదాస్పద నటి కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఆమె ఏకంగా మన జాతిపిత మహాత్మ గాంధీనే టార్గెట్ చేశారు. గాంధీ అహింసా మార్గాన్నే ఆమె ఎగతాళి చేసింది. ‘ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి’ అని గాంధీజి ప్రవచించిన అహింస సూత్రాన్ని అపహాస్యం చేసింది. ‘అలా చేస్తే దక్కెది స్వాతంత్య్రం కాదు.. అది భిక్షే అవుతుంది’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లకు అప్పట్లో గాంధీ నుంచి మద్దతు లభించలేదని ఆమె వ్యాఖ్యానించింది. 

కాగా కొద్ది రోజుల క్రితం కంగనా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 1947లో భారత్ కు స్వాతంత్య్రం రాలేదని, అది భిక్ష అని, భారత్ కు అసలైన స్వాతంత్య్రం 2014లో వచ్చిందని కంగనా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కంగనాకు ఇచ్చిన అవార్డులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే కంగనా మాత్రం వెనక్కి తగ్గడం లేదు.. 

ఇప్పటికే ఆమె ట్విట్టర్ అకౌంట్ ను తాత్కాలికంగా నిలిపివేయగా.. తాజాగా ఇన్ స్టాగ్రామ్ ను వాడుకుంటున్నారు. ‘నేతాజీని అప్పగించేందుకు గాంధీ అప్పట్లో అంగీకరించారు’ అనే శీర్షికతో వచ్చిన వార్త క్లిప్పింగ్ ను ఇన్ స్టాలో జతచేశారు. మీరు గాంధీ అభిమానిగానూ, నేతాజీ మద్దతుదారుగానూ ఉండలేరని, ఎవరో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుందని, మీ హీరోలను తెలివిగా ఎంచుకోండని కంగనా పేర్కొన్నారు. ఇక మరో పోస్టులో స్వాతంత్య్రం కోసం పోరాడే వారిని అణచివేతదారులకు అప్పగించేవారని, ఇలా అప్పగించినవారికి అధికార దాహం, కుయుక్తులే తప్ప ధైర్య సాహసాలు లేవని కంగనా వ్యాఖ్యానించింది. ప్రజలు తమ చరిత్ర గురించి, హీరోల గురించి తెలుసుకోవాల్సిన సమయం అని ఆమె పోస్టులో పేర్కొన్నారు.    

 

Leave a Comment