వైరల్ వీడియో : భారత జవాన్లకు ఈ బుడ్డోడు చేసే సెల్యూట్ సూపర్..

భారత జవాన్లు అంటే ప్రతి ఒక్కరికీ గౌరవం. దేశ రక్షణ కోసం వారు చేస్తున్న సేవకు ప్రతి ఒక్కరు సెల్యూట్ చేస్తారు. తాజాగా జమ్మూకశ్మీర్ లోని లేహ్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆర్మీ జవాన్లకు ఓ ఐదేళ్ల బాలుడు సెల్యూట్ చేస్తాడు. అటువైపు వెళ్తున్న ఆర్మీ అధికారులు ఆ చిన్న పిల్లవాడికి సెల్యూట్ చేసేటప్పుడు ఎలా నిలబడాలో సూచనలు ఇస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ బుడ్డోడి సెల్యూట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. భారత దేశపు భవిష్యత్ సైనికుడు అంటూ ట్వీట్ చేస్తున్నారు.  

Leave a Comment