ప్రపంచంలో పిల్లలకు వారి తండ్రే పెద్ద హీరో..

ఏ పిల్లలకైనా వారి తండ్రే వారికి పెద్ద హీరో.. ఎందుకంటే వారి ప్రతి పనిలోనూ తండ్రి కష్టం ఉంటుంది. పిల్లల ఎదుగుల కోసం కష్ట పడని తండ్రి ఉండడు.. ధనవంతుడైనా, పేద వాడైనా ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు ఇబ్బంది పడకూడదనుకుంటారు. వారి భవిష్యత్తు బావుండాలనికోరుకుంటారు. దీనికి అద్దంపట్టే ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హర్యానాలో ఒక తండ్రి తన పిల్లలను సైకిల్ మీద స్కూల్ కు తీసుకెళ్తున్నాడు. పిల్లలు సైకిల్ పై కూర్చోవడానికి ఇబ్బంది పడకుండా ఒక వినూత్న ఆలోచన చేశాడు. ఒక ప్లాస్టిక్ ట్రేను కత్తిరించి తన సైకిల్ వెనుక వైపు ఫిట్ చేశాడు. దానిపై పిల్లలు హాయిగా కూర్చొని తండ్రితో కలిసి పాఠశాలకు వెళ్తున్నారు. ఈ ఫొటోను ఐపీఎస్ అధికారి పంకజ్ నైన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘పిల్లలకు తన తండ్రి పెద్ద హీరో’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ ఫొటోపై నెటిజన్లు ఫిదా అయ్యారు. తన పిల్లల కోసం తండ్రి చేసిన కృషికి సలాం చేస్తున్నారు. 

Leave a Comment