10 పైసలే బిర్యానీ.. బిర్యానీ కోసం 1.5 కిలోమీటర్ వరకు క్యూ 

బిర్యానీ అంటే ఇష్టపడని వారుండరు. ఈ పేరు చెప్పగానే నాన్ వెజ్ ప్రియులకు నోరూరుతుంది. లొట్టలేసుకుని తింటారు. బిర్యానీకి ఉన్న క్రేజ్ అలాంటిది. చాలా మంది వ్యాపారులు బిర్యానీపై ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇక 10 పైసలకే బిర్యానీ దొరుకుతుంది అంటే ఊరుకుంటారా? కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి గుంపులు గుంపులుగా ఎగబడ్డారు.  

తమిళనాడులోని చాలా జిల్లాల్లో అక్టోబర్ 11న అంటే ఆదివారం బిర్యానీ డే సందర్భంగా వ్యాపారులు భారీ ఆఫర్లు ప్రకటించారు. తిరుచ్చి, మధురై, దింగిగల్, చెన్నైలలో ఒకరికి మించి ఒకరు ఆఫర్లు ప్రకటించారు. ఓ ప్రముఖ రెస్టారెంట్ అయితే తమ వద్ద బిర్యానీ కేవలం 10 పైసలే అంటూ ప్రచారం చేసింది. ఇంకేముంది ఉదయం నుంచి ఆ రెస్టారెంట్ వద్ద జనాలు క్యూకట్టారు. కోవిడ్ నిబంధనలను సైతం బేఖాతరు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి బిర్యానీ ఆఫర్లు ప్రకటించిన వ్యాపారులపై మున్సిపల్ అధికారులు కేసు నమోదు చేశారు. 

కర్నాటక 1.5 కిలోమీటర్ల క్యూ..

ఇదిలా ఉండగా, కర్నాటక రాష్ట్రంలో అన్ని రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. కరోనా కారణంగా బయటి ఆహారినికి దూరమైన జనాలు రెస్టారెంట్ల భోజనం కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. బెంగళూరులోని ఓ ప్రముఖ రెస్టారెంట్ వద్ద బిర్యానీ కోసం జనం క్యూ కట్టరు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచే బిర్యానీ కోసం క్యూలో నిల్చున్నారు. దాదాపు 1.5 కిలోమీటర్ల మేర బారులుతీరారు. ఆ ప్రాంతంలో ప్రతి ఆదివారం ఇదే సీన్ కనిపిస్తుంది. కరోనా నిబంధనలను సైతం పాటించకుండా బిర్యానీ కోసం ఎగబడ్డారు. 

 

Leave a Comment